నికుంజము

 

ఏప్రిల్ 23, 2024

నికుంజము  (nikunjamu)

   అర్థము

    (విశేష్యము): పొదరిల్లు; గుహ

  Meaning

   (noun) : thicket; arbour; den

   వాడుక / Usage

    నికుంజములో ప్రణయసల్లాపాలతో అలసిన ప్రేయసీప్రియులకు నిద్రాభంగం కలుగుతుందేమో అని తోలుకోడి కూయలేదు.
    The rooster didn't crow at dawn lest it disturbs the love birds resting from the exertions of their amorous night.

   మెదడుకు మేత / Food for thought

    “అవును. జంతుధర్మాలు ఆహారనిద్రాభయాదులు. ఆహారం బ్రతకటానికి, నిద్ర శ్రమ తీర్చుకోడానికి, భయం జాతినీ వ్యక్తినీ రక్షించడానికీ, నాల్గవది జాతిని వృద్ధి చేయడానికి. ఈ జంతుధర్మాలు ఎవ్వరూ మానలేరు. ఏదో ఉగ్రమైన తపస్సుచేసేవారే మానగలుగుతారు. నిష్కామకర్మ అంటే ఈ నాలుగు ధర్మాలు నిష్కామంగా ఆచరించగలగడమే.”

“ఈ జంతుధర్మాలు నెరవేరుస్తూ వాని ఫలం ఎలా వదులుకోగలడు మానవుడు?”

“ఆత్మజ్ఞానం సంపాదించుకొని కర్మఫలాన్ని దహించుతూ మనుష్యుడు జీవితమార్గం నడవాలి.”

“ఆకలివేస్తే అన్నం తింటాడు.”

“అవును.”

“అన్నం తినగానే తృప్తి పొందుతాడు.”

“అవును.”

“ఆ తృప్తి మనస్సుకు. ఆ మనస్సుకే లోబడినవాడు ఇది నాకు కాదు అని ఏలా అనుకోగలడు గరుదేవా?”

“ఈ మనస్సు, దేహం నేను కాను అనే విచారణవల్ల.”

-- అంశుమతి, అడవి బాపిరాజు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి