ఉత్తుంగము
ఏప్రిల్ 25, 2024
ఉత్తుంగము (uttungamu)
అర్థము
(విశేషణము): పొడవైనది; ఎత్తైనది; ఉన్నతమైనది
Meaning
(adj) : high; tall; lofty
వాడుక / Usage
ఆకాశం బద్దలైందా.. నేల ఈనిందా... ఇది సముద్ర కెరటమా? జన ఉత్తుంగ తరంగమా?
Have the heavens opened up? The earth bounteous? Waves of ocean? Or a mighty sea of people?
మెదడుకు మేత / Food for thought
హృదయము లేని లోకము సుమీ యిది మాపుల పశ్చిమంబుగా
ఉదయము తూర్పుగా నడచుచుండు సనాతన ధర్మ ధేనువుల్పిదికిన పాలు పేదకు లభింపవు శ్రీగలవాని యాజ్ఞలో
పెదవి మెదల్ప జాల రరవిందభవ ప్రముఖామృతాంధసుల్
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే
-- గబ్బిలము, గుర్రం జాషువా
Comments
Post a Comment