గిద్ద
ఏప్రిల్ 30, 2024
గిద్ద (gidda)
అర్థము
(విశేష్యము): సోలలో నాల్గవ భాగం; ఎనిమిది కుంచలు; చిన్న కొడవలి
Meaning
(noun) : a measure; measuring vessel of height 4 stacked coins and holding 225 grains
వాడుక / Usage
మా ఊరి సంతలో గిద్ద బియ్యానికి రెండు గిద్దలు దుద్ది పళ్ళు వచ్చేవి.
A measure of rice fetched 2 measures of cherries at our village market.
మెదడుకు మేత / Food for thought
అత్యంత దారుణ, కఠిన పరిస్థితుల మధ్య ఎనిమిదేండ్లు జైలు జీవితం గడిపాను. వీల్‌ఛైర్ నుంచి బయటకు కదలలేకపోయా. సొంతగా టాయిలెట్‌కీ వెళ్లలేకపోయా. కనీసం పైకి లేచే పరిస్థితి లేదు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జీవితం ముందుకు సాగడం కష్టమనిపించింది. కానీ, ఈరోజు సజీవంగా బయటకు రావడం నిజంగా ఆశ్చర్యమే.
-- మావోయిస్టులతో సంబంధమున్న కేసులో నిర్దోషిగా తేలి, జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా
Comments
Post a Comment