కజ్జలము
ఏప్రిల్ 04, 2024
కజ్జలము (kajjalamu)
అర్థము
(విశేష్యము): కాటుక; సిరా; చీకటి; మబ్బు
Meaning
(noun) : collyrium; lampblack; dark cloud
వాడుక / Usage
విప్పారిన ఆమె కనులు, చుట్టూ దిద్దిన కజ్జలము కొలనులో కలువని తలపిస్తున్నాయి.
Her bright eyes lined with mascara looked like a lily in a pond.
మెదడుకు మేత / Food for thought
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
(నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.)
(నల్లత్రాచుయొక్క పడగనీడను వసించు కప్ప బ్రతుకెంత అస్థిరమైనదో ఆ విధముగనే ఎల్లప్పుడు దోషములను వెదకు యజమానుని సేవించువాడి బ్రతుకును ప్రాణభయముతో కూడినది.)
-- సుమతీ శతకం
Comments
Post a Comment