మ్రోల

 

ఏప్రిల్ 24, 2024

మ్రోల  (mrōla)

   అర్థము

    (విశేష్యము): ఎదుట; ముందర; ముందు భాగం

  Meaning

   (noun/adj) : before; in front; presence of

   వాడుక / Usage

     "భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు.. నీ రాజసానికవి నీరాజనాలు".
    O lord of the world! these earnest songs before you are salutations to your magnificence.

   మెదడుకు మేత / Food for thought

    ఎదలోపలి యెదలో, నె

    మ్మదిలో, జీవిత రహస్యమార్గమ్ములలో

    వదలని కోరిక వై, నా

    బ్రదుకుబరువు లెల్ల పాట పాడింతు సఖీ!


    చలువపిసాళిగాలి నునుచక్కిలిగింతల కౌగిలింతలన్

    నిలువున పాటగా కరగనేర్చునొ నీరవ వేణువీథి! నీ

    వలపుతలంపు సోకిననె, ప్రాణసఖీ! బ్రతు కెల్ల కోటి గొం

    తుల విడి సోనలై పొరలు నూతన గీత సుధాపథాలలో!


    నీ యాజ్ఞ కూడెనా, గొంతుముడి వీడెనా

    హాయిగా యుగయుగంబుల కలల్ పాడనా!

    చిర గాఢనిద్ర మేల్కొలిపి సందేశాల

    పరపనా దిక్కు దిక్కులకు చుక్కలకు!

    -- ఊర్వశి, దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి