ముగుద

 

ఏప్రిల్ 05, 2024

ముగుద  (muguda)

   అర్థము

    (విశేష్యము): ముగ్ధ; స్త్రీ; మహిళ

  Meaning

   (noun) : maid; damsel; lady

   వాడుక / Usage

    "ముగుద! నీదు సహజమూర్తి చూడక యుండ వలచుటెట్లు ప్రేమకలుగుటెట్లు?
    O maiden! how can I fall in love with you without seeing your true form?

   మెదడుకు మేత / Food for thought

    విశ్రమ్య విశ్రమ్య వనే ద్రుమాణాం
    ఛాయాసు తన్వీ విచచార కాచిత్‌ ।
    స్తనోత్తరీయేణ కరోద్ధృతేన
    నివారయంతీ శశినో మయూఖాన్‌॥


(ఒక స్త్రీ తన ప్రియుని విరహవేదనా భారాన్ని భరించలేక శరీరం కృశించి, ఒక తోటలో రోజంతా గడిపి, రాత్రి కాగానే ఏర్పడిన పండువెన్నెల చల్లదనం కూడా తాపం నివారించలేక పోవడంతో తన పైట కొంగును పైకెత్తి పట్టుకొని ఆ వెన్నెలలు తన వక్షముల మీద పడకుండా చూసుకుంటూ, మాటిమాటికీ దట్టమైన చెట్లనీడకు చేరి అలసట
తీర్చుకుంటోంది. ఆ స్త్రీకి వెన్నెలలే ఎండను మించిన తాపాన్ని కలిగిస్తున్నాయని అతిశయోక్తి.)

-- 
శృంగార శతకం, భర్తృహరి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి