గుమ్మ
ఏప్రిల్ 19, 2024
గుమ్మ (gumma)
అర్థము
(విశేష్యము): పాలు పిండినప్పుడు వచ్చే ధార; స్త్రీ
Meaning
(noun) : gush of milk; darling/damsel
వాడుక / Usage
పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకి సిరితీగ పాప ఊగేది తీపి కాటుకే.
The young bee is here to taste the flow of honey; the creeper sways for that sweet sting.
మెదడుకు మేత / Food for thought
చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి
లేదూ, చీకటిలాంటి గుహ.
కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు
ఎవరి ఎడారిలో వాళ్ళం!
ఎవరి ఎడారిలో వాళ్ళం!
అయినా గానీ
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-
--ఇద్దరి చీకటి, అఫ్సర్
Comments
Post a Comment