గిల్లికజ్జా

 

ఏప్రిల్ 17, 2024

గిల్లికజ్జా  (gillikajjā)

   అర్థము

    (విశేష్యము): కోరి పెట్టుకున్న కజ్జాలు (కయ్యాలు); కొట్లాట 

  Meaning

   (noun) : quarrel typically initiated by irritating/troubling others

   వాడుక / Usage

    మరుమల్లెల్లోన పుట్టింది కొత్త ఆవిరి మసకేసే ముందే సాగింది గుండె దోపిడి ఈ గిల్లికజ్జా ఏనాటిది.
    The jasmines are steamy and the hearts' lost even before dark! Ageless is this lovers' squabble.

   మెదడుకు మేత / Food for thought

    మంచి కవిత్వమంటే మనకు బాగా తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపించడమో, లేదా అసలెన్నడూ చూడని లోకానికి తలుపు తీయడమో చెయ్యాలని నేననుకుంటాను. ఇతర దేశాల కవులనూ వాళ్ళ కవిత్వాలనూ చదువుతున్నప్పుడు మనం చాలా సందర్భాల్లో మనకు తెలియని లోకాన్నే చూస్తాం. వాళ్ళ సిద్ధాంతాలు వేరు. సంస్కృతీసంప్రదాయాలు వేరు. ఆ లోకపు తత్వాలూ భావాలూ, వాళ్ళ ఋతువులూ రంగులూ, సమస్యలూ స్పందనలూ అన్నీ మన కవితాప్రకటనకు ఎంతోకొంత భిన్నంగానే ఉంటాయి. అదే మన దేశంలోని ఇతర భాషలను తీసుకుంటే, మన మధ్య ఇన్ని భేదాలు కనపడవు. కొసలను పట్టుకు చూస్తే దూరం తెలీదని కాదు కాని, స్థూలంగా ఆచారవ్యవహారాలు వేరైనా మనందరినీ కలిపే సూత్రమేదో ఇక్కడ ఉంది.

    -- మానస చామర్తి, ఈమాట ఏప్రిల్ 2017 సంచిక

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి