పసరు
మే 15, 2024
పసరు (pasaru)
అర్థము
(విశేష్యము): ఆకురసము; ఆకుపచ్చన; వ్యాపించు; పైత్య రసం
Meaning
(noun) : juice of leaves; green colour; spreading; bilious vomit
వాడుక / Usage
పసరు పవనాలలో పసికూన రాగాలు.
The lilting tender songs of the wind swaying in the green leaves.
మెదడుకు మేత / Food for thought
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వనందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
-- శివతాండవం, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)
Comments
Post a Comment