తలయూచు

 

మే 16, 2024

తలయూచు  (talayoochu)

   అర్థము

    (క్రియ): సంతోషము లేక అంగీకారం సూచించు; మెచ్చుకొను

  Meaning

   (verb) : show happiness or agreement; praise

   వాడుక / Usage

    పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు తలిరాకు.
   Dazzling in the golden rays brimming with joy are the budding leaves. 

   మెదడుకు మేత / Food for thought

    కళ్లలోనే వుండిపోయాడు కానీ
    గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.
    నౌక మీదనే బహు దూరాలు వెళ్ళాడేమో
    కానీ, సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు.
    ఎక్కడయినా చుక్కలా రాలిపడ్డానా
    ఎగాదిగా చూస్తారు అందరూ
    పగటి బతుకులోనే గడిచిపోయింది కాలమంతా
    కాసింత నీడ ఎలా వుంటుందో తెలియలేదు.
    నడుస్తూనే వున్నాను అనంతంగా
    మైలు రాయి వొక్కటయినా ఇందాకా చూడలేదు.
    గుబాళించే ఈ పూలన్నీ నావి కావు
    నేను పడుకుని వున్న ముళ్ళ పడక నువ్వు చూడలేదు.
    నన్ను ప్రేమించిన ప్రతి వొక్కరూ అంటారు
    నేనొక బండ రాయినని!
    కాలుతున్న కొవ్వొత్తిని కదా,
    నన్నెవరూ తాకి చూడలేదు.

    -- బషీర్ బద్ర్ ఘజల్ కి అఫ్సర్ అనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి