బహుపరాకు

 

మే 17, 2024

బహుపరాకు  (bahuparāku)

   అర్థము

    (విశేష్యము): పరాకు=హెచ్చరిక, ప్రమాదం, ఏక దృష్టి; బహు=మిక్కిలి; రాజులు సభలోకి ప్రవేశించేప్పుడు సేవకులు చేసే హెచ్చరిక; ప్రశంస

  Meaning

   (noun) : call to attention in a court when the king arrives; praises

   వాడుక / Usage

    తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని.
    Listen to the praises of leaves and let your radiant white smile banish the dark night. 

   మెదడుకు మేత / Food for thought

   కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి
   మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి
   సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ 
   “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు
   బైబిల్. నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల
   నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత
   మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.

-- అఫ్సర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి