పుట్టి

 

మే 03, 2024

పుట్టి  (puṭṭi)

   అర్థము

    (విశేష్యము): ధాన్యపు కొలత; ఇరవై కుంచాలు; యేరు దాటడానికి వాడే పెద్ద గంపలాంటి పడవ

  Meaning

   (noun) : a dry measure; ~500 pounds weight; circular basket weight 

   వాడుక / Usage

    శ్రీశైలం పాతాళ గంగలో పుట్టి మీద ప్రయాణం ఆహ్లదకరం ప్రమాదకరం కూడాను.
   Sailing on a wicker basket in Srisaliam's Patalaganga is both beautiful and dangerous. 

   మెదడుకు మేత / Food for thought

     తోటలో నా రాజు తొంగి చూసెను నాడు
     నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
     
    నవ్వులా అవి కావు.. నవ పారిజాతాలు
    రవ్వంత సడిలేని.. రసరమ్య గీతాలు
    ఆ రాజు ఈ రోజు అరుదెంచునా
    అపరంజి కలలన్నీ చిగురించునా

    చాటుగా పొదరింటి మాటుగా ఉన్నాను
    పాటలాధర రాగ భావనలు కన్నాను

    ఎలనాగ నయనాల కమలాలలో దాగి
    ఎదలోన కదలే తుమ్మెద పాట విన్నాను
    ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ
    అనురాగ మధుధారయై సాగనీ


-- ఏకవీర, సినారె

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి