తెలి

 

మే 06, 2024

తెలి  (teli)

   అర్థము

    (విశేషణము): తెల్లనిది; నిర్మలము; కాచిన నేయి

  Meaning

   (adj) : white; pure; clear; bright

   వాడుక / Usage

    తెలి మంచు కరిగింది  తలుపు తీయనా ప్రభూ.
   The morning fog has cleared; Shall I open the door, dear Lord! 

   మెదడుకు మేత / Food for thought

    సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః
    సందేశం మే హర ధనపతిక్రోధ విశ్లేషితస్య ,
    గన్తవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం
    బాహ్యోద్యాన స్థితహరశిరశ్చంద్రికాధౌత హర్మ్యా

    (సంతప్తులకు (వేగిపోతున్నవారికి – ప్రవాసం చేతనో, ఎండ బాధతోనో) నువ్వే రక్షకుడివి (ప్రవాసం వెళ్ళిన వాళ్లు వర్షాకాలానికి తిరిగి ఇంటికి వస్తారు. ఎండల నుండీ మేఘుడి వర్షం రక్షిస్తుంది). కాబట్టి శాపం వల్ల భార్యకి దూరమైన నాకు నువ్వే రక్ష. నా సందేశం నువ్వే తీసుకెళ్లాలి. నువ్వు తప్పనిసరిగా అలకా నగరానికి వెళ్లాలి. కైలాసంలో బయటి ఉద్యానవనంలో కూర్చున్న శివుడి తల మీద ప్రకాశిస్తున్న చంద్రుడి వెన్నెలలో తెల్లగా మెరుస్తున్న భవనాలు కలది, అని. అలకాపురం కైలాసం పక్కనే ఉన్నది, అప్పుడప్పుడూ సాక్షాత్తు శివుడే కనిపిస్తుంటాడు. ఇంతకన్నా గొప్ప ఆకర్షణ ఏముంటుంది
)

    -- మేఘదూత (పూర్వ మేఘం 7వ శ్లోకం), మహాకవి కాళిదాసు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి