ఇల
మే 07, 2024
ఇల (ila)
అర్థము
(విశేష్యము): నేల; ఆవు; మాట
Meaning
(noun) : the Earth; cow; spoken word
వాడుక / Usage
ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.
The earth's voice is trembling; Shall I give the wake up call, dear Lord!
మెదడుకు మేత / Food for thought
తస్మిన్నద్రౌ – కతిచిదబలా -విప్రయుక్తః స కామీ
నీత్వా మాసాన్ – కనకవలయ – భ్రంశరిక్తప్రకోష్ఠఃఆషాఢస్య – ప్రథమదివసే – మేఘమాశ్లిష్టసానుం
వప్రక్రీడా – పరిణతగజ – ప్రేక్షణీయం దదర్శ
(ఎప్పుడూ భార్యను తలుస్తూ ఆ విరహ వ్యధలను అనుభవిస్తూ యక్షుడు చిక్కిపోయాడు. ధరించిన బంగారు కడియాలేమో అతని చిక్కిపోయిన చేతులనుండి జారిపోతున్నాయి. (శృంగారము రెండు విధాలు – సంభోగము, విప్రలంభము. వియోగశృంగారానికి పరాకాష్ఠ మేఘదూతము.) ఏనుగులు ఒక గోడను లేక భూమిని ఢీకొన్నట్లు కొండ చుట్టూ ఆషాఢమేఘాలు ఆవరించుకొన్నాయి.)
-- మేఘదూత (పూర్వ మేఘం 2వ శ్లోకం), మహాకవి కాళిదాసు
Comments
Post a Comment