కువకువ

 

మే 08, 2024

కువకువ  (kuva-kuva)

   అర్థము

    (విశేషణము): కోకిల కూత; పావురాల కూత; పసి బిడ్డ ఏడ్పు వంటి

  Meaning

   (adv) : warbling of pigeons or cuckoos; cry of a new born child

   వాడుక / Usage

    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.
   Your arrival is welcomed by the cooing songs of the cuckoo. 

   మెదడుకు మేత / Food for thought

    అనాదిగా జరుగుతున్న
    అన్యాయం ఇదిలే 
    అదేమిటో-ఆడ దంటే
    మగవాడికి అలుసులే 
    అనాదిగా జరుగుతున్న
    అన్యాయం ఇదిలే 
    ఎవడో ఒకడన్నాడని -
    అదియె ప్రజా వాక్యమని 
    అగ్ని వంటి అర్ధాంగిని
    అడవికంపె రాముడు - శ్రీ రాముడు
    జూదమాడి ఒకరాజు
    ఆలినోడినాడు 
    సత్యం సత్యమని ఒక మగడు
    తన సతిని అమ్మినాడు 
    అదేమిటో - ఆడ దంటే
    మగవాడికి అలుసులే
    కాలం మారింద న్నారు -
    సంఘం మారిందన్నారు 
    మారలేదు మారలేదు -
    మగవారి మనసులు 
     మనసులు లేని చేతలు

    -- తేనె మనసులు, ఆత్రేయ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి