గారాబు

 

మే 09, 2024

గారాబు  (gārābu)

   అర్థము

    (విశేష్యము): గారాబము; మిక్కిలి ప్రియము

  Meaning

   (noun) : affection; indulgence

   వాడుక / Usage

    గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు.
   Endearing poem is the whistling of wind; swaying flowers in a musical ecstasy. 

   మెదడుకు మేత / Food for thought

    తన్వీశ్యామాశిఖరిదశనా పక్వబిమ్బాధరోష్టీ
   మధ్యేక్షామాచకితహరిణీ ప్రేక్షణా నిమ్న నాభిః |
    థ్రోణీ భారాదలసగమనాస్తోక నమాస్తనాభ్యాం
   యాత త్రస్యాద్యువతివిషయే సృష్టిరాద్యెవధాతుః ॥

    (సన్నని, నడియౌవనవతి, కోణములు తేలిన పళ్ల వరుసతో దొండపండు వంటి క్రింది పెదవితో, సన్నని నడుముతో, భయముతో ఉన్న జింక కళ్ళవలె పెద్ద కళ్ళు కలిగి, లోతైన బొడ్డుతో, పీరుదుల భారంతో నిమ్మదిగా నడిచే, వక్షోజముల వల్ల వంగినట్లయ్యి స్త్రీ విషయకమైన బ్రహ్మ తొలి శిల్వమువలె ఉన్న స్త్రీ)

    -- మేఘదూతం, పూర్వమేఘ 19వ శ్లోకం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి