లేశము
జూన్ 11, 2024
లేశము (lēṣamu)
అర్థము
(విశేష్యము/విశేషణము): కొంచెము; కొంచెపు తనము; అల్పత్వము; అణువు
Meaning
(noun/adj) : little; small; particle; atom; littleness; smallness
వాడుక / Usage
నేటి రాజకీయ పరిభాషలో లేశమైనా సిగ్గు మర్యాద గౌరవం లేవు.
Today's political discourse doesn't have an iota of shame, dignity or respect.
మెదడుకు మేత / Food for thought
వ్యాప్తింబొందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం
దృప్తింజెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?
దృప్తింజెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?
(లభించినది ఎంత కొంచం అయినాసరే ఉబ్బితబ్బిబ్బు పడకుండా, అదే పదివేలుగా భావించి తృప్తిపడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరుతుందా?)
-- శ్రీ వామన చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం, పోతన
Comments
Post a Comment