యదృచ్ఛ
జూన్ 12, 2024
యదృచ్ఛ (yadṛichcha)
అర్థము
(విశేష్యము): తనకు తానే; అప్రయత్నముగా; ఇష్టమునకు తగునట్లు
Meaning
(noun) : of ones own accord or free will; without compulsion or labour
వాడుక / Usage
వాతావరణ నమూనాలో కనిపించింది కేవలం యదృచ్ఛ కాదు అని లారెంజ్ కనుగొన్నాడు.
Lorenz discovered that the data in weather sampling was not purely independent.
మెదడుకు మేత / Food for thought
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు; సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభతుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును జలధార ననలంబు సమయునట్లు
సంతోషిఁ గాకుంట సంసార హేతువు; సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభతుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును జలధార ననలంబు సమయునట్లు
-- శ్రీ వామన చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం, పోతన
Comments
Post a Comment