చెక్కిలి
జూన్ 28, 2024
చెక్కిలి (chekkili)
అర్థము
(విశేష్యము) : చెంప; కపోలము
Meaning
(noun) : cheek
వాడుక / Usage
"కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు".
Damsel's cheeks blush in red; furtive eyes compose of love an ode.
మెదడుకు మేత / Food for thought
ప్రశ్నలే లేనప్పుడు జవాబుతో పని ఏమిటి
దారులే లేనప్పుడు గమ్యంతో పని ఏమిటిముక్కలై పోయినపుడు కంటిలోని అలలన్నీ
చెంపపై జారుతున్న నవ్వులతో పని ఏమిటి
చుక్కలను సిగపూలుగ తురుముకున్న రాత్రుల్లో
చీకటే నెచ్చెలియ వెలుగులతో పని ఏమిటి
పల్చనై పోతుంటే అనురాగం మనసుల్లో
మౌనమే బాగున్నది రాగాలతో పని ఏమిటి
గుండెలో ఇరుకైతే ఉండాలా అందులోనె
ప్రాణమే గడ్డకడితె నెత్తుటితో పని ఏమిటి
పూలపై పేరుకున్న మంచులోని సుగంధాలు
గాలిలో లేనప్పుడు ఊపిరితో పని ఏమిటి
మంచులా కరుగుతున్న దారుల్లో జారుతుంటె
పచ్చిగా మొలకెత్తే ప్రేమలతో పని ఏమిటి
- అబ్ద్ వాహెద్
Comments
Post a Comment