పగులు లోయ
జూన్ 06, 2024
పగులు లోయ (pagulu loya)
అర్థము
(విశేష్యము): రెండు ఖండ పర్వతాలకు లేదా ఎత్తైన ప్రాంతాలకు మధ్య ప్రాంతం కిందికి దిగడం వల్ల ఏర్పడిన లోయ
Meaning
(noun) : rift valley
వాడుక / Usage
భారత్‌లో నర్మదా, తపతి నదులు ప్రవహించే లోయలు పగులు లోయలు.
Narmada and Tapati flow through rift valleys.
మెదడుకు మేత / Food for thought
ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చా సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. “పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనలపై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పీటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము – శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.
-- 'దోస్తయేవస్కీ కథలు' లో దోస్తయేవస్కీ గురించి
Comments
Post a Comment