తీండ్రము

 

జులై 02, 2024

తీండ్రము  (tīnḍramu)

   అర్థము

   (విశేష్యము) : తీక్షణము; ప్రచండము; చురుకుతనం; వేడిమి; ప్రకాశము
 

  Meaning

   (noun) : splendour; warmth; fierce; active; radiance

   వాడుక / Usage

    "కదులుతున్నాయి మనిషి గుండెలో గాండ్రించే అరణ్యాలు, గీపెట్టే సముద్రాలు, తీండ్రించే జలపాతాలు".
    Man's heart resonates with roaring forests, wailing oceans, fierce waterfalls.

   మెదడుకు మేత / Food for thought

    ధ్వనికీ ప్రతిద్వనికీ మద్యనేను
    హింసకీ ప్రతహింసకీ మద్యనేను
    విధ్వంసానికీ నిర్మాణనికీ మద్యనేను
    వ్రణనికీ రక్తకణనికీ మద్యనేను
    వధ్యశిలలకూ కలలకు మద్యనేను
    మౌనానికీ మానవాగ్నికీ మద్యనేను
    చిదిమిన గాయాలకూ చిందిన వెలుతురుకూ మద్యనేను
    కన్నీటిలోయలకూ కాంతి శిఖరాలకూ మద్యనేను
    అణచివేతకూ ఆయుధానికీ మద్యనేను

    -- అలిశెట్టి ప్రభాకర్ (జనవరి 12, 1954 - 1993)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి