క్రమక్షయం
జూన్ 07, 2024
క్రమక్షయం (krama kshayam)
అర్థము
(విశేష్యము): ప్రవాహమువల్ల కోసివేయుట; అరుగుదల; ఒరపిడి
Meaning
(noun) : erosion
వాడుక / Usage
మృత్తికా క్రమక్షయం వల్ల సుమారు ఏటా 30 నుంచి 50 టన్నుల పంటనష్టం జరుగుతుంది.
Soil erosion causes 30 to 50 tonnes of crop loss annually.
మెదడుకు మేత / Food for thought
ప్రతి మనిషిలోనూ మంచీ – చెడూ రెండూ ఉంటాయి. సామాన్యంగా మనం మన మంచి ముఖాన్ని మాత్రమే ఎదుటివారికి చూపడానికి ఇష్టపడతాం. ఇక్కడ ‘మంచి’ అనేది ఆయా సమూహాల చేత ఆమోదింపబడిన సూత్రాల ఆధారంగా నిర్వచింపబడుతుంది.సమూహపు అంగీకారం కోసం, ఒక్కోసారి మనం మనకు ఇష్టంలేని పనులు చేస్తుంటాం. చేయదలుచుకున్న వాటిని ఆపేస్తుంటాం. ఏ మనిషీ, ఎల్లవేళలా అందరికీ నచ్చేటట్టుగా ప్రవర్తించలేడు. ఒక్కోసారి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మెజారిటీ జనానికి అర్థరహితంగా అనిపించే అవకాశం ఉందని తోచినప్పుడు, అతను ఆ ఇష్టాన్ని అణిచిపెట్టి, ఎదుటివారికి ఏది నచ్చుతుందో అదే చేసే, లేదా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. దీన్నే ఇంకొంచెం ముందుకెళ్లి, మెటాఫరికల్ గా ‘స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్’ అని కూడా అనెయ్యచ్చేమో. కానీ ఈ నవలా నాయకుడు మీర్ సాల్ట్, అందుకు ఒప్పుకోలేదు. తనకి తోచినట్టుగా చేయడం, అలా చేయాలనిపించిందని చెప్పడం – ఎందుకు తప్పో అతనికి అర్థం కాలేదు. అందుకే అతడు సమూహం చేత అంగీకరింపబడలేదు. ఇంకా చెప్పాలంటే బహిష్కరించబడ్డాడు కూడా. అంతేకాక, జీవించే అర్హతను సైతం కోల్పోయాడు. వారికి ఒక స్ట్రేంజర్ గా, బయటి వ్యక్తిగా మిగిలిపోయాడు. నిజానికి సమూహమే అతడికి అర్థం కానంత కొత్తగా ఉండిపోయింది.
-- అపరిచితుడి ఆంతరంగిక మథనం, ఆల్బర్ట్ కామూ పుస్తకం గురించి భవాని ఫణి
Comments
Post a Comment