నూపురము

 

జూన్ 14, 2024

నూపురము  (nūpuramu)

   అర్థము

   (విశేష్యము): అందె; మంజీరము; గజ్జె; మువ్వ
 

  Meaning

   (noun) : an anklet with bells

   వాడుక / Usage

    వయ్యారి నడకల నీ నూపుర రవళి నా గుండెలయలకి మత్తెక్కిస్తోంది.
    The sound of your anklets as you sashay, make my heart beat to a heady high.

   మెదడుకు మేత / Food for thought

    చెలియే మృత్యువు? చుట్టమే యముఁడు? సంసేవార్థులే కింకరుల్?
    శిలలం జేసెనె బ్రహ్మదన్ను? దృఢమే జీవంబు? నో చెల్లరే!
    చలితం బౌట యెఱుంగ కీ కపట సంసారంబు నిక్కంబుగాఁ
    దలఁచున్ మూఢుఁడు సత్యదాన కరుణాధర్మాదినిర్ముక్తుఁడై

    (అయ్యయ్యో! మృత్యువు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడు దగ్గర చుట్టమా? యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏమైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాళ్ళతో కానీ మలచాడా? సత్యం ఇలా ఉండగా, మూర్ఖుడు సత్యమూ దానమూ దయా ధర్మమూ మొదలైనవాటిని వదలివేస్తున్నాడు. ఈ మాయాసంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు)

    -- శ్రీ వామన చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం, పోతన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి