టెంకి

 

జూన్ 10, 2024

టెంకి  (ṭenki)

   అర్థము

    (విశేష్యము): స్థానము; చోటు; గృహము; మడుగు; పిడి సాన; తల వెనుక భాగం 
 

  Meaning

   (noun) : place; house; reservoir; a boring tool; back of head

   వాడుక / Usage

    దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత టెంకేల.
    The all pervading has shown me the path, why confine to "my" village or house?

   మెదడుకు మేత / Food for thought

    నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
    నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
    సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
    సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.

    (వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము.)

    -- శ్రీ వామన చరిత్ర, ఆంధ్ర మహాభాగవతం, పోతన

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి