మానసము
జూన్ 26, 2024
మానసము (mānasamu)
అర్థము
(విశేష్యము) : మనస్సు; అభిప్రాయము; ఒక సరస్సు; విష్ణువు ఆకారము
Meaning
(noun) : mind; seat of reasoning; a lake
వాడుక / Usage
"బ్రహ్మ మానస గీతం మనిషి గీసిన చిత్రం చేతనాత్మక శిల్పం మతి కృతి పల్లవించె చోట".
Ballad of Brahmas mind, painted by man, sculpture with consciousness, a place where thought and action grow tender shoots.
మెదడుకు మేత / Food for thought
చూపు ఎంత అలిసిందో తోడు ఉన్న చుక్కల్ని అడుగు
ఓర్పు ఎంత విసిగిందో గోడు విన్న చంద్రుణ్ణి అడుగు
వేచి ఉన్న ఘడియలన్ని వెక్కిరించి వెళుతుంటే
అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు
అహం ఎంత అలిగిందో కమ్ముకున్న మౌనాన్ని అడుగు
ప్రతినిముషం నరకంగా రాతిరంత గండంగా
గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు
గుండె ఎంత పొగిలిందో ఆదుకున్న సూర్యుణ్ణి అడుగు
ఎన్నికోర్కెలెన్నికలలు గంగపాలు అవుతుంటే
వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు
వలపు ఎంత వగచిందో సాక్ష్యమున్న వెన్నెల్ని అడుగు
మనిషి కాదు ఉత్తి మాట కూడ జాడ లేకుంటే
మనసు ఎంత నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు
మనసు ఎంత నలిగిందో నిలిచి ఉన్న ప్రాణాన్ని అడుగు
- జ్యోతిర్మయి మళ్ల
Comments
Post a Comment