జన్యుశాస్త్రం

 

జులై 15, 2024

జన్యుశాస్త్రం  (janyusaastram)

   అర్థము

   (విశేష్యము) : వారసత్వ గుణాలను అధ్యయనం చేసే శాస్త్రం
 

  Meaning

   (noun) : genetics

   వాడుక / Usage

    మనిషి మాట్లాడింది ఎప్పుడు అన్న అంశంలో శిలాజాలు, జన్యుశాస్త్రం మంచి ఫలితాలను ఇస్తోంది.
    The key to origin of language is being answered by fossils and genetics.

   మెదడుకు మేత / Food for thought

     సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ
     నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ 

      (నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. జీవాత్మ ఆ పట్టణానికి రాజు, దాని పరిపాలన అంతా అహంకారము, బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మరియు జీవ-శక్తి అనే మంత్రిత్వ శాఖల ద్వారా నడిపింపబడుతాయి. కాలము, మృత్యు రూపంలో, శరీరాన్ని తీసివేసే వరకూ, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమైన యోగులు తమను తాము శరీరంగా భావించరు, అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులము అనుకోరు. అన్ని కర్మలను మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు, అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకు ఆసక్తిరహిత పరిశీలకుడిగా (సాక్షిగా) నిలిచిపోవటం.)

    -- కర్మసన్యాస యోగం, భగవద్గీత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి