వితండము
జులై 22, 2024
వితండము (vithandamu)
అర్థము
(విశేష్యము) : ఔననునది కాదని వాదించడం; తలుపు గడియ
Meaning
(noun) : frivolous argument; lock attached to door
వాడుక / Usage
రాముడు తెలుగులో లే పక్షి ! అన్నాడా? అని ఒక వితండవాదం లేవదీశారు.
A frivolous argument was raised about the origin story of Lepakshi!
మెదడుకు మేత / Food for thought
నింద లేనిదే బొందె పోదు
(పూర్వం ఎవరు పోయినా, జనాలు ఎలా పోయాడు అంటే, యముడు తీసుకుని పోయాడు అనే వారట.
ప్రతిసారి ఇది విని యముడు వెళ్లి ఈశ్వరుని తో నీ ఆజ్ఞ ప్రకారం కదా నేను వాళ్ళను తీసుకొచ్చేది మరి అందరూ నన్ను నిందిస్తున్నారు ఏంది నాకు ఈ శిక్ష అంటే, అప్పుడు త్రిమూర్తులు ఆలోచించి, ఇక నుంచి జీవి ఎదో ఒక రోగము తో పోతాడు, దాంతో నీ పేరు ఎవరు వాడరు అని చెప్పారట. అప్పటినుంచి, జీవులు ఎదో ఒక కారణంగా పోవడం లేదా పోయిందానిక ఒక కారణం చెప్పుకోడం మొదలు పెట్టారట.)
-- సామెత
Comments
Post a Comment