తిరస్కారము
జులై 29, 2024
తిరస్కారము (tiraskāramu)
అర్థము
(విశేష్యము) : అనాదరము; నిరాకరణము; ధిక్కారము
Meaning
(noun) : rejection; scorn; insult
వాడుక / Usage
మొన్నటి ఎన్నికలలో ప్రజలు మత రాజకీయాలని తిరస్కరించారనే చెప్పాలి.
It has to be said that the electorate rejected religious politics in the recent elections.
మెదడుకు మేత / Food for thought
కూర్చుండ మా యింట కురిచీలు లేవు, ప్రణయాంకమే సిద్ధపరుచుచుంటి ,
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు , నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి,
పూజకు మావిట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి,
నైవేద్యము ఇడ మాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియనుంటి,
లోటు రానీయ నున్నంతలోనా నీకు రమ్ము దయసేయు మాత్మ పీఠమ్ము పైకి,
అమృత ఝరి చిందు నీ పాదాంకముల యందు కోటి స్వర్గాలు మొలిపించు కొనుచు తండ్రీ

-- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)
Comments
Post a Comment