తీర్మానము
ఆగష్టు 07, 2024
తీర్మానము (tīru-mānamu)
అర్థము
(విశేష్యము) : నిర్ణయం; చర్చించి తీసుకునే నిర్ణయం; తీరిక
Meaning
(noun) : decision; resolution; leisure
వాడుక / Usage
సిఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం.
We will move privilege motion against CM.
మెదడుకు మేత / Food for thought
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఆయనకున్న ఇతర విశిష్టతలు:
- మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి
- మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
- తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే
- తెలుగులో తొలి నవల వ్రాసింది ఆయనే
- తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కందుకూ
- ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన కందుకూరి జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది.
-- వికిపీడియాలో కందుకూరి వీరేశలింగం పంతులు గురించి
Comments
Post a Comment