జల్పము

 

జులై 23, 2024

జల్పము  (jalpamu)

   అర్థము

   (విశేష్యము) : ఉపయోగం లేని మాటలు; గొప్పలు; తర్కంలో ఎదుటివారి మాటను ఖండించే పద్ధతి - దీని ఉద్దేశం నిజం తెలుసుకోడం కాదు. కేవలం మనం నమ్మినది నిజం అని చెప్పడమే
 

  Meaning

   (noun) : idle talk; bombast; an argument where an overbearing rejoinder is given

   వాడుక / Usage

    నేటి చర్చలలో వేడి పుట్టించే జల్పమే కానీ వెలుగు చూపించే సత్యాన్వేషణ లేదు.
    Today's discussions are temperature raising bombast rather than finding truth.

   మెదడుకు మేత / Food for thought

     తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు

    (వేల్పులతోకూడిన వెటకారం. తిమ్మరాజు = తిరుమలదేవుడు. ఈయనకు ప్రసాదాలే ప్రసాదాలు. తిన్నంత తిండి.

పోతరాజు = నాంచారమ్మ, నూకాలమ్మ, మావూళ్ళమ్మ ఇలాంటి గ్రామదేవతలకు ఒక్కడే తమ్ముడు అవటంవల్ల గారాబంతో ఏపనీ చేయడు.ఒట్టిగా తింటూ ఏపనీ చేయనివారికి వాడతారు)

    -- సామెత

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి