విడత

 

ఆగష్టు 09, 2024

విడత  (vidatha)

   అర్థము

   (విశేష్యము) : మొత్తము కార్యక్రమంలో ఒక విడి దశ
 

  Meaning

   (noun) : phase 

   వాడుక / Usage

    రెండో విడత రుణమాఫీ నిధుల జమ నేడే.
    Second round of loan waiver disbursement today.

   మెదడుకు మేత / Food for thought

    గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
-- గిడుగు రామమూర్తి గురించి వికీపీడియాలో

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి