నెర్రె

 

ఆగష్టు 16, 2024

నెర్రె  (nerre)

   అర్థము

   (విశేష్యము) : నేల పగులు; చీలిక
 

  Meaning

   (noun) : a crack (in the ground); fissure 

   వాడుక / Usage

    పొలాల్లో నెర్రెల మేట; పైరంతా పశువులకు మేత.
    Farm lands cracking up in fissures; crops end up as cattle feed.

   మెదడుకు మేత / Food for thought

    స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించి, దాన్ని ఎప్పటికైనా సాధించి తీరుతానంటూ శపథం చేసిన ముందుకు సాగిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయుల్లో మొదటి వారు తిలక్‌. జాతీయవాదిగా, సామాజికవాదిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించి, దేశవ్యాప్తంగా సామాన్యులు సైతం ఆ ఉద్యమంలో పాల్గొనే విధంగా చేయడంలో ఆయన పాత్ర అమోఘమైనది. అందుకే ఆయన్ను సంపూర్ణ స్వరాజ్యోద్యమానికి పితామహుడిగా చరిత్రకారులు చెబుతారు.
-- బాల గంగాధర్ తిలక్ (జులై 23, 1856 - 1920) గురించి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి