వల్లి
ఆగష్టు 26, 2024
వల్లి (valli)
అర్థము
(విశేష్యము) : తీగ; లత; భూమి
Meaning
(noun) : creeper; climbing plant; earth
వాడుక / Usage
ప్రేయసీ బాహు వల్లికల నడుమ స్వర్గపు అంచులు చవి చూడనా!
Entwined in the creeper like arms of the beloved; heavenly it is!
మెదడుకు మేత / Food for thought
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
గుండెను గుడిగా చేసాను నువ్వుండలేనని వెళ్ళావు
వలచుటా తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా!
-- మురళీకృష్ణ (1964), ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment