పులినము
ఆగష్టు 28, 2024
పులినము (pulinamu)
అర్థము
(విశేష్యము) : ఇసుక దిబ్బ / తిన్నె
Meaning
(noun) : sandbank; sandy beach
వాడుక / Usage
సాయంసంధ్యా సమయాన యమునా పులిన తీరాన నల్లనయ్య చెంత....
On the sandy banks of Yamuna with Krishna by the side...
మెదడుకు మేత / Food for thought
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరూ కళ్ళకెలా తెలుసు
తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్ళు దారీ ఓ ముళ్ళ దారీ
రాలేరు ఎవరూ నాతో చేరీ
వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్నీ
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసూ
-- అంతులేని కథ (1976), ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment