అంతరాళము
ఆగష్టు 29, 2024
అంతరాళము (antarāḷamu)
అర్థము
(విశేష్యము) : అన్ని దిక్కులకు మధ్య చోటు; నడిమి భాగం
Meaning
(noun) : the middle space; interval between earth and space
వాడుక / Usage
నిండు జాబిల్లి దిశాంతరాళములలో వెన్నెల కాయగా గోపాలుడు రాస క్రీడలాడాడు.
As the full moon lit the earth and celestial space, Krishna danced Raasa.
మెదడుకు మేత / Food for thought
తేట తేట తెలుగులా... తెల్లవారి వెలుగులాతేరులా.. సెలయేరులా.. కల కలా.. గల గలా
కదలి వచ్చింది.. కన్నె అప్సరా
వచ్చి నిలిచింది.. కనుల ముందరా..
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
తెలుగువారి ఆడపడుచు ఎంకిలా
ఎంకి కొప్పులోని.. ముద్దబంతి పువ్వులా
రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి
ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి
లోలోన.. నాలోన.. ఎన్నెన్నో రూపాలు
వెలసినవి..... వెలసినవి... వెలసినవి...
వీణలా.. నెరజాణలా... కల కల.. గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
ఎదుట నిలిచింది కనుల ముందరా
-- ప్రేమనగర్ (1971), ఆత్రేయ (మే 7, 1921 - 1989)
Comments
Post a Comment