ఫలకము
ఆగష్టు 15, 2024
ఫలకము (phalakamu)
అర్థము
(విశేష్యము) : పలక; చదునుగా ఉండే రాతి; అర చేయి; పిరుదు
Meaning
(noun) : slate; a flat stone/metal to write on; palm; hinder part
వాడుక / Usage
సౌర ఫలకాల సంద్రం - అన్నమయ్య జిల్లా గాలివీడు తూమకుంట దగ్గర.
Sea of solar panels - at Gaaliveedu in Annamayya district.
మెదడుకు మేత / Food for thought
‘అమాయక పౌరుల మీద దాడులకు దిగే ప్రభుత్వానికి నాగరిక ప్రభుత్వమని చెప్పుకునే హక్కు లేదు. అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు కూడా!’. స్వాతంత్య్ర పోరాట చరిత్రలో పంజాబ్ సింహమంటూ కీర్తి పొందిన లాలా లజపతిరాయ్ ఒక సందర్భంలో అన్నమాటలివి. మత సంస్కరణలు, వాటి లోతుపాతుల గురించి లజపతి ముందు నుంచి బాగా ఆలోచించారు. అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం కోణం నుంచి ఆయన భారతదేశాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. ‘భారతీయ పత్రికలని శాసించే అధికారమే నాకు ఉంటే, ఈ మూడు శీర్షికలు మొదటి పేజీలో ఉండాలని చెబుతాను. పసివాళ్లకి పాలు, తినడానికి పెద్దలకు తిండి, అందరికీ విద్య.
-- లాలా లజపత్ రాయ్ (జనవరి 28, 1865 - 1928) గురించి
Comments
Post a Comment