గుడాకేశడు
సెప్టెంబర్ 02, 2024
గుడాకేశడు (gudaakesudu)
అర్థము
(విశేష్యము) : గుడాక+ఈశుడు; గుడాక (నిద్ర ) ను జయించినవాడు; అర్జునుడు; శివుడు
Meaning
(noun) : one who has conquered sleep; Arjuna; Shiva
వాడుక / Usage
గుడాకేశుడు, ‘గోవిందా, నేను యుద్ధం చేయను’ అంటూ మౌనముగా ఉండిపోయాడు.
Arjuna said, "Govinda, I will not fight", and stayed silent.
మెదడుకు మేత / Food for thought
అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలంకృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్
(చిల్లగింజపొడి మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమైన జీవుని జ్ఞానాభ్యాసం అనేటటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం అనేది తనంతట తానుగానే లీనమైపోతూ ఉంది)
-- ఆత్మబోధ , శ్రీ ఆది శంకరాచార్యులు
Comments
Post a Comment