అమీనా

 

సెప్టెంబర్ 12, 2024

అమీనా  (amīnā)

   అర్థము

   (విశేష్యము) : అధికారి; తీర్పులను అమలు చేసేవాడు; కోర్టు ఉద్యోగి 

  Meaning

   (noun) : officer of civil court; revenue officer

   వాడుక / Usage

    అమీనా ఇచ్చిన నోటీసు ఇంట్లో అల్లకల్లోలం రేపింది.
    The notice served by the court clerk sent shock waves through the house.

   మెదడుకు మేత / Food for thought

    విద్యా వ్యాపారం ఒక విషవృక్షం. దీనికి మూలాలు ఎక్కడో ఎప్పుడో పడ్డాయి. ఈ తరంలో ఉపాధికీ, మంచి జీవనానికీ, సంపాదనకీ, కులాల వికాసానికీ, భాష సర్వ నాశనం కావడానికీ, అన్నిటికీ మించి చదువులు కార్పొరేట్‌ వ్యాపారం కావడానికీ -అన్నిటికీ పునాదులు ఏర్పడి తేలికగా నూటపాతిక సంవత్సరాలయింది. చరిత్ర గోత్రాలు సాహిత్యంలో దొరుకుతాయి. 1897లో ప్రచురితమయిన గురజాడ 'కన్యాశుల్కం' -ఈనాటి పరిణా మాలకు ప్రారంభ సూచికలని అందజేస్తుంది. గిరీశం వెంకటేశంతో కలిసి వాళ్ల ఊరు వచ్చినప్పుడు అగ్నిహోత్రా వధాన్లు భార్య వెంకమ్మ ''బాబూ -యేదీ, మా అబ్బాయీ మీరొక్క పర్యాయం ఇంగిలీషు మాట్లాడండి బాబూ'' అని అడుగుతుంది. పర్యవసానం 'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌..' అంటూ చేసిన మోసం. ఇంగిలీషు మోజు అప్పటికే ప్రారంభమయిపోయిన రోజులు.

-- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి