వాఙ్మూలం

 

సెప్టెంబర్ 13, 2024

వాఙ్మూలం  (vaangmoolam)

   అర్థము

   (విశేష్యము) : న్యాయస్థానంలో చెప్పే సాక్షం; మాట / వ్రాత పూర్వకమైన సాక్ష్యం

  Meaning

   (noun) : deposition; oral statement; testimony

   వాడుక / Usage

    17 ఆగస్ట్, 1909 న “సవాలు’’ అనే పేరుతో భారత విప్లవకారులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఉరికంబం ఎక్కేముందు మదన్ లాల్ ఢింగ్రా చివరి వాఙ్మూలం ఇది.
    On 17/8/1909 Indian revolutionaries released a pamphlet of the last testimony of Madan Lal Dhingra before he was hanged.

   మెదడుకు మేత / Food for thought

    గొప్పగా మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో అనర్థమైన ఉదాహరణ హిట్లర్‌. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో. మరి గొప్ప విషయాలను బొత్తిగా నేలబారుగా మాట్లాడే గొప్ప వ్య క్తులు? మూడు ఉదాహరణలు చాలు. మహాత్మా గాంధీ, శ్రీశ్రీ, రామకృష్ణ పరమహంస. గొప్ప విష యం చెప్తూ, గొప్ప వక్తగానూ చెల్లుబాటయే గొప్పతనం చరిత్రలో అరుదు. అలాంటి గొప్పతనం కొట్టొచ్చినట్టు చరిత్ర చేసిన వ్యక్తి -కాదు వ్యవస్థ -స్వామి వివేకానంద. చెప్పిన విషయంలో, చెప్పడంలో ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతుల్ని చేసిన ఘనత వివేకానందుడిది.

-- గొల్లపూడి మారుతీ రావు (ఏప్రిల్ 14, 1939 - 2019)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి