పొత్తి

 

సెప్టెంబర్ 16, 2024

పొత్తి  (potthi)

   అర్థము

   (విశేష్యము) : మెత్తటి / సన్నని పాత వస్త్రం; చెట్టు నార; దివిటీ; ధాన్యపు రాశి

  Meaning

   (noun) : thin/soft old cloth; soft fiber of coconut tree; torch; heap of grains

   వాడుక / Usage

    విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి పెంచి పెద్ద చేసే దేవతే కదా వానంటే.
    Isn't rain the God that delivers the sapling from the womb of the seed into the soft cloth of earth and nurtures it into a tree?

   మెదడుకు మేత / Food for thought

    ఏదో పురా శాసనాన్ని అమలు చేస్తున్నట్లుగా కురుస్తోంది వాన - అని ఉంటుంది ఏదో కథలో. అవును. ఈ వాన ఆదిమకాలం నుంచి, మానవుని రాక కోసం ఎదురు చూస్తూ, మానవుని ఆవిర్భావానికి ముందే సిద్ధమయ్యి, మానవునితో పాటు కలిసి ప్రయాణించడానికి కురుస్తూనే ఉంది.  

-- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి