సానువు
సెప్టెంబర్ 17, 2024
సానువు (sānuvu)
అర్థము
(విశేష్యము) : కొండనెత్తము; కొన; అడవి; సుడిగాలి
Meaning
(noun) : table land on top of a mountain; summit; forest; gale
వాడుక / Usage
అగాధాలు నిండిన సముద్రాల మీద, నిర్జీవమైన పర్వత సానువుల మీద, వాన కురుస్తూనే ఉంది.
On oceans that fill abysses, on lifeless mountain tops, the rain keeps falling.
మెదడుకు మేత / Food for thought
ఒక బిచ్చగత్తె మీద కురిసిన వాన, ఒక వెలయాలి విటుని ఎదురు చూపుల ఇంటిపై కురిసిన వాన. ఒక రోడ్డువార కాకహోటల్ కబుర్లపై కురిసే వాన. చెమ్మగిల్లి వేళ్ళు కొంకర్లు తిరగగా పాలగ్లాసు ఓదార్పు వేడికి కూడా నోచని ఒక దీనురాలిపై కురిసిన వాన. ఒక దొంగపై కురిసిన వాన. ఒక ఆడపిల్ల తండ్రిపై కురిసే వానను మీరు చూస్తారు.-- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment