కపోలము
సెప్టెంబర్ 18, 2024
కపోలము (kapōlamu)
అర్థము
(విశేష్యము) : చెక్కిలి; బుగ్గ
Meaning
(noun) : the cheek
వాడుక / Usage
ఆమె కపోలాల మీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి.
Tears flowed on her cheeks.
మెదడుకు మేత / Food for thought
పాత విశ్వాసాలను కూల్చి కొత్త నమ్మకాలను నిలబెట్టే వానను, స్థిరపడ్డ మానసిక ప్రతిబంధకాలను తుడిచి పారేసి ధైర్యాన్ని నూరిపోసే వానను, నగరాన్ని పద చిత్రాలుగా మలచిన వాననూ చూస్తారు. ఒక వాన ఒకణ్ణి తను వదిలిపెట్టిన ఇంటిని జ్ఞాపకం చేసి అతణ్ణి ఆ ఇంటి దాకా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ఒక వాన అలా పారిపోయినవాడు ఇల్లు చేరుకుంటే ఏమవుతుందో చూపిస్తుంది.-- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment