ముసురు
సెప్టెంబర్ 19, 2024
ముసురు (musuru)
అర్థము
(విశేష్యము/క్రియ) : నానుడు వాన; జడి వాన; పడుతూ ఉండే వాన; చుట్టుకొను
Meaning
(noun/verb) : continued rain; to swarm or surround
వాడుక / Usage
బయటకు చూసింది. అదే ముసురు. ఆకలిలాంటి ముసురు. పాపం లాంటి ముసురు.
She saw outside. It was the same incessant rain. Like hunger that covers you. Like moral decadence that surrounds you.
మెదడుకు మేత / Food for thought
ఎన్నో వాన కథలు. కాని వాన నీటిలో కాగితపు పడవను తయారు చేసుకుని ప్రయాణించాలనే మనిషిని ఇక్కడే చూస్తారు. వాన నీటిపై కాగితపు పడవ ప్రయాణం! ఏమిటి అర్థం? జీవితంలో కష్టం తప్పనిసరి. వాన తప్పనిసరి. ఆశ తప్ప మరే ఆదరువు లేనివారికి కాగితపు పడవే పడవ. ఆ పడవ గమ్యం చేరదు. కాని అలాంటి పడవైనా ఉందని అనుకోడం ఎంత ఓదార్పు. తెలుగు కథ ఇలాంటి వంద సెంటీమీటర్ల వాన కథలతో బలాన్ని సమకూర్చుకుంది.-- ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు
Comments
Post a Comment