తరంగదైర్ఘ్యము

 

సెప్టెంబర్ 23, 2024

తరంగదైర్ఘ్యము  (taranga-dairghyamu)

   అర్థము

   (విశేష్యము) : తరంగ = వస్తువు చలించుటచే గాలిలో ఏర్పడే చలనము; దైర్ఘ్యము = నిడువు , పొడుగు;  తరంగం యొక్క నిడువు

  Meaning

   (noun) : wave length

   వాడుక / Usage

    కాంతి యొక్క తరంగదైర్ఘ్యం దాని రంగును నిర్ణయిస్తుంది.
    Wavelength of the light determines its colour.

   మెదడుకు మేత / Food for thought

    ఓ గొప్ప శాస్త్రవేత్త, హేతువాది, ఒక మానవతామూర్తి ఈ దేశం కోసం ఆఖరి వరకు నీతి నిజాయితీగా శ్రమించి, ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశానికి స్వావలంబనకు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు అయ్యగారి సాంబశివరావు గారు. పశ్చిమగోదావరి జిల్లా మోగల్లులో జన్మించినాయన బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో అలాగే అమెరికాలో స్టాన్ఫోర్డ్, అనేక ప్రఖ్యాత విశ్వవిద్యాలయములో విద్య అభ్యసించి టాటా ఫండమెంటల్ రీసెర్చ్, తరువాత బాబా ఆటమిక్ సెంటర్లో హోమి జే బాభా గారి దగ్గరి పనిచేశారు. ఆయన అనేక ఆవిష్కరణలు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఈసీఐఎల్ ఏర్పాటుకు ముఖ్యమైన కారణం.

-- డాక్టర్ ఏ ఎస్ రావు గురించి https://suryaa.co.in/as-rao-ayyagiri-sambasiva-rao/

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి