వికిరణము

 

సెప్టెంబర్ 24, 2024

వికిరణము  (vikiranamu)

   అర్థము

   (విశేష్యము) : అంతటా వ్యాపింప చేయుట; జ్ఞానము; కిరణ పుంజము; అంతరిక్షం ద్వారా లేదా పదార్థ మాధ్యమం ద్వారా తరంగాలు లేదా కణాల రూపంలో శక్తిని విడుదల చేయడం

  Meaning

   (noun) : radiation

   వాడుక / Usage

    సూర్యుడి నుంచి వెలువడే వికిరణాలను భూమి అయస్కాంత శక్తి అడ్డుకోవడంతో రంగురంగుల కాంతులు.
    An explosion of colours when solar radiation meets earth's magnetic field.

   మెదడుకు మేత / Food for thought

    రెండో ప్రపంచయుద్ధ సమయంలో ఆయన చేసిన పరిశోధన తొలి టెట్రాసైక్లిన్‌ యాంటీ బయాటిక్‌- అరియోమైసిన్‌ ఆవిష్కారానికి దారితీసింది. ఫైలేరియా గురించి పరిశోధన చేసి, హెట్రజన్‌ ఔషధాన్ని సుబ్బారావు కనిపెట్టారు. క్షయ కట్టడికి ఐసోనికోటినిక్‌ ఆసిడ్‌ హైడ్రాజైడ్‌ను రూపొందించారు. క్యాన్సర్‌కు వాడే కీమోథెరపీ ఔషధాల్లో తొలితరం డ్రగ్‌ మెథోట్రెస్సేట్‌ను సిడ్నీ ఫార్బర్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి అభివృద్ధి చేశారు. అమెరికా రచయిత డోరోన్‌ ఆంట్రిమ్‌ మాటల్లో చెప్పాలంటే.. "బహుశా ఈ తరంలో చాలామంది ఎన్నడూ డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు విని ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆయన జీవించి ఉండటం వల్లే నేడు మనమంతా ఆరోగ్యంగా, సజీవంగా ఉంటున్నాం. ఆయన కృషే మానవాళి దీర్ఘాయుష్షుకు బాటలు పరిచింది".

-- యల్లాప్రగడ సుబ్బారావు గురించి https://www.etvbharat.com/telugu/telangana/bharat/azadi-ka-amrit-mahotsav-yellapragada-subbarao-biography/na20220812140137459459230

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి