ప్రతిదీప్తి
సెప్టెంబర్ 26, 2024
ప్రతిదీప్తి (prathideepthi)
అర్థము
(విశేష్యము) : కాంతి లేదా ఇతర విద్యుదయస్కాంత వికిరణాన్ని గ్రహించిన పదార్ధం కాంతిని ప్రకాశించడం
Meaning
(noun) : fluorescence
వాడుక / Usage
ప్రతిదీప్తి దీపాలని ఐరోపా నిషేధించాలని ప్రతిపాదించింది.
Europe is phasing out fluorescent lamps.
మెదడుకు మేత / Food for thought
సీఎల్‌ఆర్ఐ డైరెక్టర్‌గా, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్‌గా ఇరవై ఏళ్లపాటు పనిచేసిన నాయుడమ్మ.. ఒక శాస్త్రవేత్తగా తన సలహాలు, సూచనలు, పనితీరు, పరిశోధనలతో భారతదేశానికే కాక 50కి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సేవలు అందించారు. ఐక్యరాజ్య సమితి విభాగాలైన ఎఫ్ఏఓ (తర్వాత యూఎన్‌డీపీ అయ్యింది), యూఎన్ఐడీఓ, యునెస్కో వంటి సంస్థలకు కూడా సీనియర్ సలహాదారుగా పనిచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో శాస్త్ర, సాంకేతికతపై కమిటీ (కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ - సీఎస్‌టీడీ)కి అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కెనడాలోని ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ రీసెర్చి సెంటర్ (ఐడీఆర్‌సీ) గవర్నర్‌గా కూడా నియమితులయ్యారు. నాయుడమ్మ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1971లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.-- యలవర్తి నాయుడమ్మ గురించి https://www.bbc.com/telugu/india-58504384
Comments
Post a Comment