స్ఫురదీప్తి
సెప్టెంబర్ 27, 2024
స్ఫురదీప్తి (sphuradeepthi)
అర్థము
(విశేష్యము) : తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతికి గురై, ఆ కాంతి తీసివేసినాకూడా చాలాకాలం ప్రకాశించడం
Meaning
(noun) : phosphorescence
వాడుక / Usage
గోడ గడియారంలో గంటలు ప్రకాశించడం కోసం స్ఫురదీప్తికరమైన పూత పూస్తారు.
Clocks use phosphorescent coating on their dials.
మెదడుకు మేత / Food for thought
హృషీకేశ్, అబూ పర్వత ప్రాంతాలలో తీవ్రమైన తపస్సు చేశారు. అక్కడే శరత్ చంద్రసేన్ అనే మహాత్ముడు వీరికి దీక్షనిచ్చారు. నాటి నుండి స్వామి జ్ఞానానంద వీరి ఆశ్రమ నామమైనది. 1927లో "పూర్ణ సూత్రాలు" రచించి ఆ గ్రంథాన్ని జర్మనీలో ముద్రించాలని సంకల్పించి ఐరోపా వెళ్ళి అక్కడ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగా రూపొందారు. చెకోస్లవేకియా దేశపు ప్రాగ్ విశ్వవిద్యాలయంలో డి.ఎస్.సి. పట్టాను, బ్రిటన్ లోని లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. పట్టాను పొందారు. భౌతిక శాస్త్రంలో అత్యున్నత పురస్కారాలను అందుకొన్న జేమ్స్ చాడ్విక్తో కలిసి పనిచేసి పరమాణు భౌతిక విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేసి, లండన్ లో ఫెలోషిప్, అమెరికా దేశపు పురస్కారాలు పొందారు. 1947లో భారతదేశం స్వాతంత్యమైన తరువాత జవహర్ లాల్ నెహ్రూ కోరికపై స్వదేశానికి తిరిగివచ్చి ఢిల్లీలోని జాతీయ భౌతిక ప్రయోగశాల (National Physical Laboratory) లో పరమాణు భౌతిక శాస్త్ర శాఖాధిపత్యాన్ని చేపట్టి, తరువాత 1954 నుండి పదేళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగంలో ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా వెలుగొంది వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. వీరి జ్ఞాపకార్ధం పరమాణు భౌతిక శాస్త్రంలోని ప్రయోగశాలకు "స్వామి జ్ఞానానంద పరమాణు పరిశోధన ప్రయోగశాల" (Swami Jnanananda Laboratories for Nuclear Research) గా నామకరణం చేశారు.-- స్వామి జ్ఞానానంద గురించి వికీలో
Comments
Post a Comment