ఔదల

 

సెప్టెంబర్ 30, 2024

ఔదల  (audala)

   అర్థము

   (విశేష్యము) : నడి తల; నడి నెత్తి

  Meaning

   (noun) : the middle/crown of the head

   వాడుక / Usage

    ఎదురు చెప్పడానికి వీల్లేకుండా ఉన్నతాధికారి మాటను ఔదల దాల్చవలసిన కానిస్టేబుళ్ళు.
    Constables are expected to treat the words of their superiors as paramount.

   మెదడుకు మేత / Food for thought

    మనుగడ అనిత్యమన్న నిశ్చయమొక్కటే సర్వదా క్షేమకారికాగలదు. జగత్తు యావత్తు జన్మ జరా మరణాలన్న పెను మొసళ్ళతో నిండిన కాలమన్న మహాబ్ధిలో మునిగి ఉన్నాడని గుర్తెరిగిన వివేకి సర్వదా ధర్మతత్పరుడై చింతా విహీనుడై సుఖిస్తున్నాడు.

-- వ్యాసమహర్షి ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి