గురుపుంగవుడు
సెప్టెంబర్ 05, 2024
గురుపుంగవుడు (guru-pum-gavudu)
అర్థము
(విశేష్యము) : పుం-గవుడు = ఎద్దు వలే శ్రేష్ఠమైనవాడు; ఉపాధ్యాయులలో ఉత్తముడు
Meaning
(noun) : best among teachers
వాడుక / Usage
మనను తీర్చిదిద్దిన ఎందరో గురుపుంగవులకు పాదాభివందనము.
Salutations to all the great teachers who moulded us.
మెదడుకు మేత / Food for thought
పగటిచుక్కవాడికోరల నోరు తెరచిన
వన్యమృగమును పోలు చీకటి
మనిషిమీదకి దుముకుచున్నది
మధ్యాహ్నవేళ!
పగలుమాసిన ఇరులమూకను
పట్టి చీల్చగ పొడిచె నింగిని
పదను పట్టిన కత్తిమాదిరి
పగటిచుక్క
పట్టపగలే కారుచీకటి
ముట్టడిస్తే మూగవోయిన
పెద్దలంతా చుక్కపొడుపుకి
బొబ్బలు పెట్టిరి
ఇరుల బాధను తొలగజేసే
అరుణతారక వెలుగు సంపద
అడ్డు చెప్పినవారు సైతం
అనుభవిస్తురు
-- ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment