దైన్యము
అక్టోబర్ 01, 2024
దైన్యము (dainyamu)
అర్థము
(విశేష్యము) : పేదరికం, బలహీనత వల్ల కలిగే అవస్థ; దీనత్వము
Meaning
(noun) : state of poverty, weakness
వాడుక / Usage
ప్రభుత్వ వైద్యం అందని వైనం - వయోవృద్ధుల దైన్యం.
Inaccessible government medical aid - aged citizens in misery.
మెదడుకు మేత / Food for thought
జన్మజన్మాంతరాల నుండి కొనసాగుతున్న నిరంతర సంసార సాగర ప్రయాణాలలో వేల కొలది తల్లిదండ్రులు, భార్యాపుత్రులు, అన్నదమ్ములు, ఆత్మీయులు ఆదిగాగల వారితో సంయోగ వియోగాలు ఏర్పడుతున్నవి. మానవుడు ఇన్ని వేలమందిలో ఎవ్వరికోసమై పలవించగలడు? తన శరీరమే ఎరువు సొమ్ము అయిన మానవునికి ఇక బంధు సమూహం శాశ్వతం కాగలదా?-- వ్యాసమహర్షి ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం
Comments
Post a Comment